హ్యాండ్ సైకిల్
హ్యాండ్ సైకిల్ అనేది మామూలు సైకిళ్ళలా కాళ్ళతో కాకుండా చేతులతో నడిపే సైకిల్. చాలా వరకు హ్యాండ్ సైకిళ్ళు వెనుక రెండు చక్రాలు, ముందు తిప్పగలిగిన ఒక చక్రం కలిపి మూడు చక్రాలు కలిగి ఉంటాయి.
చరిత్ర
[మార్చు]
జర్మనీకి చెందిన స్టెఫాన్ ఫార్ఫ్లర్ అనే వాచ్‌మేకర్ 1655 లో మానవశక్తితో నడిచే ఒక వాహనం తయారు చేశాడు. అతను నడుము కింది భాగం చచ్చుబడిపోయిన వాడైనా,[1][2]లేదా కాళ్ళు కోల్పోయిన వాడయినా అయి ఉండవచ్చని భావిస్తున్నారు.[3]ఇతను సృష్టించిన ఆవిష్కరణే తర్వాతి ట్రై సైకిల్, బైసైకిల్ ఆవిష్కరణలకు దారితీసింది.[4]
వివరణ
[మార్చు]చాలా మంది తయారీదారులు చేతితో నడిపే, మూడు చక్రాల బండిని రూపొందించి విడుదల చేశారు.మానవ పాపిల్లోమా వైరస్ (Human Papillo Virus) సమావేశాలల్లో ఈ చేతి సైకిళ్ళు ఒక సాధారణ దృశ్యం గా ఉండేవి తరువాత తరువాత ఇవి వీధుల్లో కనిపించడం కూడా ప్రారంభించాయి. అవి సాధారణంగా డెల్టా డిజైన్ తో కూడి చేతి క్రేంకుల ద్వారా శక్తినిచ్చే ప్రామాణిక గేర్ల ద్వారా నడిచే ముందు చక్రాలతో ఉంటాయి. ఇవి చక్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వారి దేహ పై భాగాన్ని మరింత సులభంగా ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది. మొత్తం క్రాంక్ అసెంబ్లీ,ముందు చక్రం కలిసి తిరుగుతాయి, నడిపే వారు ఏకకాలంలో నడిపించడానికి, ఇరుసు క్లచ్ వేయడానికి వీలు కల్పిస్తుంది.
కొన్ని నమూనాలు రెండు ముందు చక్రాలు, ఒకే వెనుక చక్రాన్ని ఉపయోగిస్తాయి, మరికొన్ని లీన్-స్టీర్ నమూనాలను ఉపయోగిస్తాయి.
హ్యాండ్ సైకిల్ అనేది వికలాంగులు వాడే చక్రాల బండి కాదు. హ్యాండ్ సైకిల్ కి క్రాంక్, గేర్లు ఉంటాయి, అయితే వీల్ ఛైర్ ప్రధాన చక్రాలపై నేరుగా తవయా దానికి వీలుగా రిమ్ములు ఉంటాయి.[5][6]
వివిధ రకాలు
[మార్చు]


హ్యాండ్ సైకిళ్లు వివిధ రకాలుగా వస్తాయి, ఇవి వివిధ వ్యక్తులకు వారి వారి వైకల్యం, అవసరాలను బట్టి ఎంచుకో తగినట్లు ఉంటాయి . హ్యాండ్ సైకిల్, , వాలి ఉన్న బండ్లు, ట్రైసైకిళ్ల లక్షణాలతో కలిసిన మిశ్రమ జాతి వాహనాలు కూడా ఉన్నాయి. .[7]
ఫోర్క్ స్టీర్ హ్యాండ్ సైకిళ్లు
[మార్చు]ఫోర్క్ స్టీర్ హ్యాండ్ సైకిళ్లు, విక్రయించే హ్యాండ్ సైకిళ్లలో ఎక్కువ భాగం ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అవి కొద్దిపాటి నుండి తీవ్రస్థాయి వెన్నెముక గాయాలున్న వారికి బాగా పనిచేస్తాయి. వీటికి సీటు కోణాన్ని , ఫుట్ రెస్ట్ లను చాలా వరకు తమకు తగినట్లుగా సర్దుబాటు చేయగల సదుపాయాలు ఉంటాయి. వాడే అవసరాన్ని బట్టి (పోటీ పందేలల్లో, వినోదం లేదా పర్యటన) వివిధ రకాల గేర్లు,చక్రాల సైజ్, టైర్ల మందాలతో వస్తాయి . ఈ రకమైన హ్యాండ్ సైకిల్ తయారీ చేసే సంస్థలలో ఇన్వాకేర్ (అత్యంత ఖరీదు) , ఇంట్రెపిడ్ ఎక్విప్మెంట్, వర్ణ, ష్మికింగ్, సన్ రైజ్ మెడికల్ (క్వికీ) ఉన్నాయి.
లీన్ స్టీర్ హ్యాండ్ సైకిళ్లు
[మార్చు]ఈ లీన్ స్టీర్ హ్యాండ్ సైకిల్ నడిపే వారు , ఏ వైపుకు బండిని తిప్పుతారో ఆ వైపుకు బాగా వంగుతారు. అధిక వేగంతో ఉన్నప్పుడు, ఇవి అస్థిరంగా ఉంటాయి. బండి నడపటానికి పూర్తి దేహాన్ని ఉపయోగించాలి. ఈ విధానం ఒంటరిగా చేసే స్కీయింగ్ ని తలపిస్తుంది. దేహం కింది భాగం దెబ్బ తిన్న వారికి ఇది ఎంతో ఉపయోగం. అయినప్పటికీ అధిక దేహ వైకల్యం ఉన్న కొద్ది మంది క్రీడా కారులు కూడా వీటిని వాడుతారు.ఈ రకమైన హ్యాండ్‌సైకిల్ తయారీ చేసే వారు, లైటింగ్ హ్యాండ్‌సైకిల్స్, బ్రైక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఫ్రీడమ్ రైడర్) కంపెనీల వారు.
ఇంకొక రకమయిన లీన్ స్టీర్ హ్యాండ్ సైకిల్ లో, రెండు కదిలే వెనుక చక్రాలు, నడపలేని చేతులు పట్టుకొనే సదుపాయంతో ఉన్న , శక్తి యుత మైన ఒకచక్రం ఉంటాయి. దీని కారణంగా ఎత్తుగా ఉన్న ప్రదేశాలలో సులభంగా వెళ్లడమే కాకుండా, రెండు స్వయం ఛలన వెనుక చక్రాల వలన కఠినమైన మలుపులు తీసుకోవచ్చు.
రహదారేతర హ్యాండ్ సైకిళ్లు
[మార్చు]ఈ తరహా హ్యాండ్ సైకిళ్ళు,మిగతా వాటి కంటే భిన్నంగా ఉంటాయి. ఇందులో ముందు రెండు చక్రాలు, వెనుక ఒక చక్రం ఉంటాయి. ఇవి తక్కువ గేర్ నిష్పత్తి పరిధిని కలిగి ఉంతాయి. ఇవి చక్రానికి నిటారుగా ఉన్న వాలు ప్రదేశాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇస్తాయి.ఈ తరహా హ్యాండ్ సైకిల్ కొండలలో నడపడానికి వీలు కల్పిస్తుంది.. విశాలమయిన, సరిగా ట్రేడింగ్ చేయబడిన టైర్లను బిగిస్తే , మామూలు రోడ్ల మీద నడిపే బైకులను కూడా కొండ ప్రాంతాల్లో వాడవచ్చు.
పర్యటనలు చేసే హ్యాండ్ సైకిళ్లు
[మార్చు]పర్యటన కోసం హ్యాండ్ సైకిళ్ళు కూడా ఉపయోగించబడతాయి. ఈ ఆసక్తిని మెరుగ్గా ఉంచడానికి, కొంతమంది తయారీదారులు మడ్ గార్డులు, సామాన్లు భద్ర పరిచే సదుపాయం కూడా ఏర్పరచారు. హ్యాండ్ సైకిళ్ళు అభివృద్ధి చెందడంతో అవి క్రమంగా తేలికైనవిగా మారాయి. అవి దీఎత్తయిన ప్రదేశాలల్లో ను, సుదూర పర్యటనలకు మెరుగైన సామర్ధ్యం కలిగి ఉన్నాయి.
పోటీలలో పాల్గొనే హ్యాండ్ సైకిళ్లు
[మార్చు]పోటీలలో పాల్గొనే హ్యాండ్ సైకిళ్ళు గాలి వలన వేగం తగ్గకుండా ఉండటానికి , మలుపుల్లో వంగే అవసరం లేకుండా వేగ వృద్ధి కలిగించడానికి, భూమికి చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి ..
వీల్ చైర్ మార్పిడి
[మార్చు]ఒక వీల్ చైర్ ను , తగిన పరికరాలను సంధించి హ్యాండ్సైకిల్ గా మార్చవచ్చు .
మూలాలు
[మార్చు]- ↑ Jane Bidder, Inventions We Use to Go Places (London: Franklin Watts, 2006, 18)
- ↑ Rory A. Cooper, Hisaichi Ohnabe, and Douglas A. Hobson, An Introduction to Rehabilitation Engineering Boca Raton: CRC Press, 2007, 131
- ↑ Clive Richardson, Driving, the development and use of horse-drawn vehicles (B. T. Batsford, 1985, 136)
- ↑ "Medical Innovations - Wheelchair," Science Reporter, Volume 44, 2007, 397.
- ↑ Michael Weinreb (November 2, 2006). "Disabled Racers Split, With Organizers in Middle". The New York Times. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-01-08.
Handcycle, a three-wheeled device with gears and cranks that bears more of a resemblance to a bicycle than to a traditional wheelchair.
- ↑ Paciorek, Michael J; Jones, Jeffery A (2008-03-14). Disability Sport and Recreation Resources. Cooper Publishing. pp. 229–244. ISBN 978-1-884125-75-1.
Rule 159 Para 5: No mechanical gears or levers shall be allowed, that may be used to propel the chair.
- ↑ "BerkelBike". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2009-10-30.